Home Psychology previous asked questions 181-200 : Psychology previous asked questions practicable 181-200 : Psychology previous asked questions practicable Admin January 04, 2025 0 comments Share: Facebook Twitter Google+ Pinterest Whatsapp Quiz Time left: 20:0 Question No:181 కింది ఉదాహరణల నుండి, పిల్లల ప్రవర్తనా సమస్యగా పరిగణించబడనిదాన్ని గుర్తించండి. (1) సంతోష్ మూడో తరగతి విద్యార్థి. అతను రోజూ ఉదయం ఇంటి నుండి పాఠశాలకు అని వెళ్తున్నాడు,కానీ కొన్ని రోజులు మాత్రమే పాఠశాలకు హాజరవుతున్నాడు (2) రవి ఆరో తరగతి విద్యార్థి. అతను రోజూ అల్పాహారం తీసుకుంటాడు కానీ తన తల్లి తనకు అల్పాహారం ఇవ్వలేదని టీచర్‌తో చెప్పాడు (3) మోహన్ చలనాత్మక వైకల్యం ఉన్న పిల్లవాడు. అతడు టీచర్ ఇచ్చిన రేఖాచిత్రాన్ని సరిగ్గా గీయలేదు. (4) రాకేష్ ఐదో తరగతి విద్యార్థి. తన పరీక్ష పేపర్లో తక్కువ మార్కులు రావడంతో పేపర్‌ను ముక్కలుగా చించాడు Clear Selection Question No:182 సమ్మిళిత ఏర్పాటులో, ఉపాధ్యాయుడు (1) కొంతమంది విద్యార్థులను నాయకులను చేసి, తన భారాన్ని తగ్గించుకోవడానికి వారిని ఉపాధ్యాయ పాత్ర పోషించనివ్వాలి (2) ఆశించిన అభ్యసన ఫలితాలను సాధించడానికి విద్యార్థులందరికీ మద్దతు ఇవ్వడానికి బహుళమరియు విభిన్న కృత్యాలతో అనువైన ప్రణాళికను కలిగి ఉండాలి (3) మొదటి తరం అభ్యాసకుల కోసం విభిన్న అభ్యసన ఫలితాలను ఏర్పాటు చేయాలి (4) ఇచ్చిన సమయంలోనే పిల్లలందరూ పనులు పూర్తి చేయాలని పట్టుబట్టాలి Clear Selection Question No:183 రాజును అతని తల్లి తన కజిన్ ఇంటికి వెళతాడా లేదా తనతో పాటు తన తాతయ్య ఊరికి వస్తాడా అని అడిగింది. రాజుకు రెండు ఎంపికలు నచ్చడంతో, సంఘర్షణలోచిక్కుకున్నాడు. రాజు ఎదుర్కొన్న సంఘర్షణ. (1) ఉపగమ - ఉపగమ సంఘర్షణ (2) ఉపగమ - పరిహార సంఘర్షణ (3) పరిహార - పరిహార సంఘర్షణ (4) పరిహార - ఉపగమ సంఘర్షణ Clear Selection Question No:184కింది వాటిలో ఒకటి 'శైశవ దశ' యొక్క లక్షణం (1) చక్కని రాత నైపుణ్యం (2) భావోద్వేగాల నియంత్రణ (3) అహం కేంద్రీకృత (4) అత్యంత స్వతంత్రత Clear Selection Question No:185 కింది వాటిలో, విద్యార్థుల మదింపులో ప్రధానంగా ఆందోళన కలిగించే ఒక అంశం (1) బోధనాభ్యసనాన్ని, మదింపును సంఘటితం చేయడం (2) మూల్యాంకనాన్ని పాఠ్యపుస్తక ఆధారిత ఆచరణ విధానానికి పరిమితం చేయడం (3) సృజనాత్మక నైపుణ్యాలను మదింపు చేయడానికి తగినంత అవకాశం (4) విభిన్న మదింపు పద్ధతులు Clear Selection Question No:186 కింది వాటిలో థార్న్ డైక్ ఇచ్చిన “అభ్యసన నియమం” కానిది. (1) సారూప్యత నియమం (2) పరస్పర సంబంధ నియమం (3) ఉపయోగ నియమం (4) ఫలిత నియమం Clear Selection Question No:187 కింది వాటి నుండి సరికాని జతని గుర్తించండి. (1) గెస్టాల్ట్- కోఫ్కా (2) నిర్మాణాత్మకత - వైగోట్స్కీ (3) పరిశీలన - బండూరా (4) ప్రవర్తన వాదం - కోహ్లర్ Clear Selection Question No:188 మోటారు బైక్ శబ్దాన్ని తన తండ్రి రాకతో ముడిపెట్టిన ఒక బాలుడు మోటారు బైక్ వచ్చిన ప్రతిసారి తనతండ్రి రావడం లేదని తెలుసుకున్నాడు. ఇది దీనికి ఒక ఉదాహరణ. (1) ఉద్దీపన విచక్షణ (2) విలుప్తీకరణ (3) ఉద్దీపన సాధారణీకరణ (4) అయత్న సిద్దస్వాస్థ్యం Clear Selection Question No:189 అంతర్గత ప్రేరణ యొక్క ఉదాహరణను గుర్తించండి. (1) ఒక అమ్మాయి తన తండ్రి ప్రవర్తనకు గర్వపడుతుంది కాబట్టి ఇతరులతో చాలా మర్యాదగా ప్రవర్తిస్తుంది. (2) ఒక అమ్మాయి తన స్నేహితురాలికి తోడుగా వుండడం కోసం సంగీతం క్లాసుల్లో చేరింది (3) చిత్రలేఖనంను ఇష్టపడే ఒక అమ్మాయి ఎల్లప్పుడు వివిధ చిత్రాలు గీస్తుంది (4) ఒక అమ్మాయి కుటుంబాన్ని సంతోష పెట్టడం కోసం ఉద్యోగంలో చేరింది Clear Selection Question No:190 కలుగ చేసుకోని నాయకత్వం. (1) నిరంకుశ నాయకత్వం (2) జోక్య రహిత నాయకత్వం (3) ఆధిపత్య నాయకత్వం (4) అధికారయుత నాయకత్వం Clear Selection Question No:191గణిత శాస్త్రానికి సంబంధించిన నైపుణ్యాలతో సమస్య ఉన్న పిల్లవాడికి ఉండే అభ్యసన వైకల్యత రకము. (1) డిస్గ్రాఫియా (2) డిస్కాల్కులియా (3) డిస్లెక్సియా (4) డిస్ప్రాక్సియా Clear Selection Question No:192 కింది వాటిలో ఒక వ్యక్తి ప్రేరణకు దోహదపడనిది (1) లక్ష్యాలలో అస్పష్టత (2) అభిరుచి (3) అభ్యసనానికి సంసిద్ధత (4) సానుకూల పరిసరం Clear Selection Question No:193 మూర్తిమత్వానికి సంబంధించి కింది లక్షణాలలో సరికానిది (1) విలక్షణమైనది (2) స్వీయ చేతనత్వం (3) గతిశీలమైనది (4) నిశ్చలమైనది Clear Selection Question No:194 RTE చట్టం- 2009 ప్రకారం, అకాడమిక్ అథారిటీ విద్యాప్రణాళికను మరియు మూల్యాంకన విధానాలను రూపొందించేటప్పుడు క్రింది వాటిలో పరిగణించ వలసినది. (1) ఉపన్యాసాలు మరియు పరీక్షల ద్వారా నేర్చుకోవడం (2) బోధనా మాధ్యమంగా ఆంగ్లం (3) పిల్లల సర్వతోముఖాభివృద్ధి (4) ప్రాథమిక స్థాయి ముగింపులో బోర్డు పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణత చెందాలి Clear Selection Question No:195పియాజె ప్రకారం, ఈ దశ లోని పిల్లలు అన్ని వస్తువులు జీవిస్తున్నాయని భావిస్తారు. (1) పూర్వ ప్రచాలక దశ (2) మూర్త ప్రచాలక దశ (3) అమూర్త ప్రచాలక దశ (4) క్రియాత్మక Clear Selection Question No:196 NCF- 2005లో వృత్తి విద్య మరియు శిక్షణ (VET)లో ప్రవేశానికి సూచించిన కనీస వయోపరిమితి (1) 16 (2) 15 (3) 14 (4) 13 Clear Selection Question No:197ఉత్తర బాల్య దశలో సాంఘిక వికాసానికి సంబంధించిన సరైన స్టేట్మెంట్ ను గుర్తించండి. (1) పిల్లలు పెద్దలపై ఆధారపడాలని కోరుకుంటారు (2) ఈ వయస్సును 'ముఠా దశ' అని అంటారు (3) అబ్బాయిలు మరియు అమ్మాయిలు వ్యతిరేక లింగానికి ఆకర్షితులవుతారు (4) వారు ఏ సమవయస్కుల సమూహంలో ఉండేందుకు ఇష్టపడరు Clear Selection Question No:198స్నెల్లన్ చార్ట్ ఈ సామర్థ్యాన్ని గుర్తిస్తుంది. (1) వినికిడి సామర్ద్యం (2) స్పర్శ సామర్థ్యం (3) సంజ్ఞానాత్మక సామర్ద్యం (4) దృష్టి సామర్థ్యం Clear Selection Question No:199 ఆల్బర్ట్ బండూరా అభ్యసన సిద్ధాంతమును ఈ విధంగా పిలుస్తారు. (1) మనో విశ్లేషణ సిద్ధాంతం (2) స్వీయ సిద్దాంతం (3) మనో-సాంఘిక సిద్దాంతం (4) సాంఘిక అభ్యసన సిద్ధాంతం Clear Selection Question No:200క్రింది వానిలో అంతర్గత ఉద్దీపనను గుర్తించండి. (1) దాహం (2) ప్రోత్సాహకం (3) వాసన (4) శబ్దం Clear Selection Submit Test Psychology All Previous and Model MCQ's - Click here You Might Also Like Post a Comment
No comments