Home Psychology previous asked questions 461-480 : Psychology previous asked questions practicable 461-480 : Psychology previous asked questions practicable Admin February 03, 2025 0 comments Share: Facebook Twitter Google+ Pinterest Whatsapp *Time left: 20:0 Submit Test Question No:461 ఒక పిల్లవాడికి మట్టి బంతిని ఇచ్చి దానితో ఆడకోమని చెప్పారు. పిల్లవాడు దానిని మట్టితో 'తాడు'గా పేనాడు. పిల్లవాడు బంతిగా వున్న మట్టి కంటే తాడుగా చేసిన మట్టి ఎక్కువగా వుందని చెప్పాడు. పియాజె ప్రకారం ఆ పిల్లవాడు ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉన్నాడు. (1) ఇంద్రియ చలనాత్మక (2) మూర్త ప్రచాలక (3) అమూర్త ప్రచాలక (4) పూర్వ ప్రచాలక Clear Selection Question No:462 కోల్‌బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం, ఒక వ్యక్తి ఈ దశలో సామాజిక కట్టుబాట్లు మరియు నిబంధనల కంటే ఆదర్శాల ఆధారంగా తన స్వంత నైతిక విలువలను అభివృద్ధి చేసుకుంటాడు (1) 2వ దశ (2) 3వ దశ (3) 6వ దశ (4) 4వ దశ Clear Selection Question No:463 కింది వాటి నుండి, విద్యార్థులలో అభ్యసనం జరిగినట్లు సూచించే ప్రక్రియలను గుర్తించండిA. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంB. ముందుగా నేర్చుకున్న నైపుణ్యాల మెరుగుదలC. ఔషధ వినియోగం ద్వారా నిష్పాదనలో మెరుగుదలD. సామర్థ్యాల వికాసం (1) A, B & C మాత్రమే (2) A, B, C, D (3) A & D మాత్రమే (4) A, B & D మాత్రమే Clear Selection Question No:464 ఒక ఎలిమెంటరీ పాఠశాల ఉపాధ్యాయుడు 'ఆరవ తరగతి పిల్లల విద్య సంబంధ సాధనపై A మరియు B బోధనా పద్ధతుల ప్రభావం' అనే ప్రయోగాత్మక అధ్యయనం చేయాలనుకున్నాడు. ఇక్కడ, పరతంత్ర చరం (1) విద్యార్థుల సాధన (2) బోధనా పద్ధతి A (3) ఉపాధ్యాయుడు (4) బోధనా పద్ధతి B Clear Selection Question No:465 కౌమారదశలో సాధారణంగా దీని కారణంగా ఒత్తిడి, సంచలనం ఏర్పడతాయి (1) శారీరక, శరీర ధర్మ మార్పుల వలన (2) ఇతరుల ప్రవర్తనను అనుకరించడం వలన (3) అభివృద్ధిలో జాప్యం (4) స్వీయ ప్రేమ Clear Selection Question No:466 ఒక వ్యక్తికి టీచర్ ఉద్యోగం వచ్చింది. అతను ఉపాధ్యాయ వ్యత్తిని ఇష్టపడతాడు, కానీ పదోన్నతులకు అవకాశాలు తక్కువగా ఉన్నందున అతను ఎటువంటి ప్రమోషన్లు లేకుండా పదవీ విరమణ చేయవలసి ఉంటుందని భావించి చేరాలా వద్దా అని నిర్ణయించుకోలేకపోయాడు. ఇక్కడ ఆ వ్యక్తి ఎదుర్కొంటున్న సంఘర్షణ (1) ఉపగమ - ఉపగమ (2) ఉపగమ - పరిహార (3) పరిహార - పరిహార (4) పరిహార - ఉపగమ Clear Selection Question No:467 పునరభ్యసనానికి సంబంధించి సరికాని స్టేట్‌మెంట్ ను గుర్తించండి (1) మునుపటి అభ్యసనం కంటే పునరభ్యసనానికి ఎక్కువ సమయం పడుతుంది (2) మొదటిసారి అభ్యసించినప్పటి కంటే, పునరభ్యసనానికి తక్కువ ప్రయత్నాలు పడుతాయి (3) పునరభ్యసనం అభ్యసించిన విషయాలను బాగా అర్థం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది (4) పునరభ్యసనం పునఃస్మరణను మెరుగుపరచవచ్చు Clear Selection Question No:468 దీనిని R-S నిబంధన సిద్ధాంతం అంటారు (1) శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం (2) యత్న దోష అభ్యసన సిద్ధాంతం (3) కార్య సాధక నిబంధన సిద్ధాంతం (4) అంతర్ దృష్టి అభ్యసన సిద్ధాంతం Clear Selection Question No:469 కింది వాటి నుండి, సాంఘీక -ఉద్వేగ చర్యను సూచించే స్టేట్‌మెంట్ ను గుర్తించండి (1) ఆసరాతో నిలబడి ఉన్న పిల్లవాడు (2) ఆహారం తింటున్న పిల్లవాడు (3) కళ్ళరెప్పలు వేస్తున్న ఒక పిల్లవాడు (4) ఒక పిల్లవాడు తన తల్లిని కౌగిలించుకోవడం Clear Selection Question No:470 విద్యా హక్కు చట్టం, 2009 ప్రకారం, నియామక అధికారి తన నియంత్రణలో ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయుల ఖాళీలు మొత్తం మంజూరైన వాటిలో ఈ శాతాన్ని మించకుండా చూసుకోవాలి. (1) 10% (2) 20% (3) 25% (4) 50% Clear Selection Question No:471 NCF- 2005 ప్రకారం, పాఠశాలలు తప్పనిసరిగా ఈ విలువలతో గుర్తించబడాలిA. సమానత్వంB. సామాజిక న్యాయంC. వైవిధ్యానికి గౌరవంD. పిల్లల గౌరవం మరియు హక్కులు (1) C & D మాత్రమే (2) A & B మాత్రమే (3) A, B, C & D (4) A, B & D మాత్రమే Clear Selection Question No:472 శివ శైశవ దశలో తన అక్క వయసులో ఉన్న ఆడపిల్లలందరినీ 'అక్కా' అని పిలిచేవాడు. తరువాత, అతను నెమ్మదిగా బేధాన్ని తెలుసుకొని తన సోదరిని మాత్రమే 'అక్కా' అని పిలిచాడు. దీనిని వివరించే వికాస సూత్రం (1) వికాసం సాధారణం నుండి నిర్దిష్ట ప్రతిస్పందనల దిశగా కొనసాగుతుంది (2) వికాసం పరస్పర సంబంధం కలిగి ఉంటుంది (3) వికాసం ఏకరీతిగా ఉండదు (4) వికాసం సర్పిలంగా వుంటుంది Clear Selection Question No:473 ఒకే పరిమాణంలో చిరుతిండిని కలిగి ఉన్న వివిధ ఆకార పెట్టెల నుండి ఏ పెట్టెను తీసుకోవలో తెలియక తికమకపడే పిల్లవాడు పియాజె సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం యొక్క ఈ దశలో ఉన్నాడు (1) అమూర్త ప్రచాలక దశ (2) ఇంద్రియ చాలక దశ (3) పూర్వ ప్రచాలక దశ (4) మూర్త ప్రచాలక దశ Clear Selection Question No:474 ఎరిక్సన్ యొక్క మనో- సాంఘిక వికాస దశ III లోని ప్రవర్తన యొక్క అనుకూల అంశం 'చొరవ' అయితే అదే దశలోని ప్రవర్తన యొక్క ప్రతికూల అంశం (1) ఏకాంతం (2) అపరాధం (3) న్యూనత (4) సిగ్గు Clear Selection Question No:475 ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తల్లిదండ్రుల ఓరియంటేషన్ లో, పిల్లల్లో సానుకూలత, సహనం, ఓర్పు, స్నేహశీలత, ప్రశాంతత వంటి లక్షణాలను పెంపొందించేందుకు వీలుగా పాఠశాలకు సహకరించాలని వారిని అభ్యర్థించారు. ఇక్కడ ప్రధానోపాధ్యాయుడు వీటిని అభివృద్ధి చేయడం గురించి మాట్లాడుతున్నారు (1) సహజ సామర్థ్యాలు (2) అభిరుచులు (3) ప్రజ్ఞ (4) వైఖరులు Clear Selection Question No:476 రాజు తన స్నేహితుడిని, 'మీ అబ్బాయి ఇంటర్మీడియట్‌లో ఏ గ్రూపు చదువుతున్నాడు' అని అడిగాడు. అతని స్నేహితుడు, 'నా కొడుకు ఇంటర్మీడియట్‌లో ఉన్నాడు, కానీ, అతను ఏ గ్రూప్‌లో ఉన్నాడో నాకు తెలియదు' అని సమాధానం ఇచ్చాడు. రాజు స్నేహితుడి పెంపక శైలి (1) జోక్యరహిత (2) నిరంకుశ (3) అధికారయుత (4) అనుమతిపూర్వక Clear Selection Question No:477 ఒక పరిశోధకుడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల పిల్లల యొక్క సాంఘీక వికాసాన్ని అధ్యయనం చేయాలనుకుంటున్నారు. కింది వాటిలో అధ్యయనం చేయటకు ఉత్తమమైనది (1) ప్రక్షేపక పరీక్ష (2) అనెక్డొటల్ రికార్డ్ (3) ప్రయోగం (4) అంత:పరిశీలన Clear Selection Question No:478 కింది వాటిలో ఒకటి అభ్యాసకుల అభ్యసనాన్ని ప్రభావితం చేసే పరిసర కారకం కాదు (1) ఉపాధ్యాయుని అనుభవం (2) తోబుట్టువుల సంఖ్య (3) అభ్యాసకుడి వయస్సు (4) పాఠశాల యాజమాన్యం Clear Selection Question No:479 వైగాట్‌స్కీ ఒక వ్యక్తి యొక్క సంజ్ఞానాత్మక వికాసంలో ఈ క్రింది అంశాలలో ఒకదానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వలేదు (1) భాష (2) సాంస్కృతిక మరియు సాంఘిక పరిసరం (3) మధ్యవర్తిత్వం (4) జీవసంబంధమైన Clear Selection Question No:480 కింది వాటిలో ప్రేరణ యొక్క సాధారణ సూత్రాలను గుర్తించండిA. అభ్యసనకు సంసిద్ధతB. అభ్యసనంలో చురుకుగా పాల్గొనడంC. లక్ష్యం మరియు ప్రయోజనం యొక్క స్పష్టతD. తగిన పద్ధతులు మరియు పరికరాల ఉపయోగం (1) B, C & D మాత్రమే (2) A , B & C మాత్రమే (3) A, B, C & D (4) A, C & D మాత్రమే Clear Selection You Might Also Like 621-650 : Psychology previous asked questions practicableMarch 06, 2025591-620 : Psychology previous asked questions practicableMarch 03, 2025501-530 : Psychology previous asked questions practicableMarch 01, 2025 Post a Comment
No comments